ప్రభుత్వ అధికారుల కొరకు: 1 తిమోతి 2:1-4
మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను.ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.
- రాష్ట్రపతి
- ప్రధాన మంత్రి
- సుప్రీం కోర్టు
- హై కోర్టు న్యాయ మూర్తులు
- సైన్యాధి పతులు
- గవర్నర్లు
- మేయర్లు
- MLA లు, MP లు
- ఇతర ప్రభుత్వాధి కారులు కొరకు ప్రార్ధించాలి.
సంఘ నాయకుల కొరకు: 1 థెస్స 5:12,13
మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి
వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.
- సంఘకాపరి
- సండేస్కూలు టీచర్స్
- సంఘ పెద్దలు
- పరిచారకులు మొదలైన స్థానికి సంఘ నాయకుల కొరకు అనుదినం ప్రార్ధించాలి.
ఇతర క్రైస్తవ నాయకుల కొరకు:
- సువార్తికులకోసం
- బైబిల్ బోధకుల కోసం
- క్రైస్తవ సాహిత్యం కోసం
- క్రైస్తవ రచయితల కోసం
- ఎడిటర్ల కోసం
- బైబిల్ సొసైటీ వంటి ముద్రణాలయాల కోసం
- సువార్త గాయకులు
- సంగీత కళాకారులు
- యూత్ లీడర్స్
- చిన్న పిల్లల పరిచర్య చేసే వారి కోసం
మిషనరీ పరిచర్య కొరకు:
యేసు క్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది వున్నారు. అయితే, సర్వలోకానికి సువార్త ప్రకటించాల్సిన భాద్యత మన మీదుంది.
(మత్తయి 28:18-20)
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
మనం ఆపని చేయలేకపోయినా, చేసే వారి నిమిత్తం తప్పక ప్రార్ధించాలి.
ఇతర క్రైస్తవ పరిచర్యలు కొరకు:
- రేడియో
- టెలివిజన్
- కర పత్రికల పరిచర్య
- దండయాత్రల పరిచర్య
- సువార్త బృందాలు
- చెరసాల పరిచర్య
- యూత్ పరిచర్య
ప్రత్యేకమైన అవసరాల కొరకు:
- టి.వి, వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలను గురించి
- వరదలు
- భూకంపాలు
- అతివృష్టి
- అనావృష్టి
- ప్రమాదాలు
- వ్యాధులు
- హృదయ విదారకమైన పరిస్థితుల గురించ
- తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి గృహాలు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్న వారి నిమిత్తం
- వ్యసనాలకు బానిసలైన వారి కొరకు
- వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్న వారి రక్షణ కొరకు
- దొంగతనము చేసే వారి రక్షణ కొరకు
- సేద్యం చేస్తున్న రైతుల కోసం
- అనుకూల వర్షాల కొరకు
- దేశాన్ని కావలి కాస్తున్న సైనికుల కొరకు
- ప్రపంచ వ్యాప్తంగా నీతి నిమిత్తం హింసించబడుతున్న వారి కొరకు
నీ ప్రియమైన వారికోసం:
వారి రక్షణ, వ్యక్తిగత అవసరాల కొరకు.
Pray for India Organization
- Pray for India Organization team వారి భాద్యతను సక్రమముగా నిర్వహించులాగున
- ఆర్ధిక వనరులు ప్రభువు సమకూర్చులాగున
- ఇట్లా… అనేక విషయాలను గురించి ప్రార్ధించాల్సిన బాధ్యత మన మీదుంది
ఆ భారం నీకుందా?
ప్రార్ధిద్దాం! ప్రభువు చెంతకు నడిపిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!